Share News

America-China: అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో కొత్త మలుపు

ABN , Publish Date - Oct 02 , 2025 | 08:16 AM

ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధం చేస్తున్న ట్రంప్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 4 వారాల్లో సమావేశం కానున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశం అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త దిశను చూపిస్తుందా అనేది ఆసక్తికరంగా ఉంది.

America-China:  అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో కొత్త మలుపు
America-China Trade Deal

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధం చేస్తున్న ట్రంప్.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో నాలుగు వారాల్లో సమావేశం కానున్నట్టు ప్రకటించారు.

ఈ సమావేశంలో అమెరికా సోయాబీన్స్ ఎగుమతులు ప్రధాన చర్చనీయాంశంగా ఉంటాయని ట్రంప్ తెలిపారు. చైనా దేశం.. అమెరికా సోయాబీన్స్ కొనుగోలును తగ్గించడం వల్ల అమెరికన్ రైతులు గణనీయ నష్టపోతున్నారని, ఇది 'వాణిజ్య చర్చల కోసం చేస్తున్న ఒక వ్యూహం' అని ట్రంప్ అన్నారు.


'మేము టారిఫ్‌ల ద్వారా చాలా డబ్బు సంపాదించాం. ఆ డబ్బులో చిన్న భాగాన్ని తీసుకుని మా రైతులకు సహాయం చేస్తాం. నేను మా రైతులను ఎప్పుడూ నిరాశపరచను!' అని ట్రంప్ హామీ ఇచ్చారు. జో బైడెన్ పాలనలో చైనాతో ఏర్పడిన వాణిజ్య ఒప్పందాలను అమలు చేయకపోవడాన్ని కూడా ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. సోయాబీన్స్, టిక్‌టాక్ వంటి అంశాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమావేశం అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త దిశను చూపిస్తుందా అనేది ఆసక్తికరంగా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 09:52 AM