Share News

China nursing home: నర్సింగ్‌హోమ్‌లో నర్సుల స్పెషల్ ట్రీట్‌మెంట్.. వృద్ధుల ముందు అసభ్యంగా..

ABN , Publish Date - Oct 12 , 2025 | 02:49 PM

చైనాలోని ఒక హాస్పిటల్‌లో విచిత్రమైన ధోరణితో చర్చనీయాంశంగా మారింది. ఆ హాస్పిటల్‌లోని నర్సుల ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ హాస్పిటల్‌లో జాయిన్ అయిన వృద్ధ రోగులను ఉత్సాహపరిచేందుకు నర్సుల చేత అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తున్నట్టు బయటపడింది.

China nursing home: నర్సింగ్‌హోమ్‌లో నర్సుల స్పెషల్ ట్రీట్‌మెంట్.. వృద్ధుల ముందు అసభ్యంగా..
nursing home scandal

చైనా (China)లోని ఒక నర్సింగ్‌హోమ్‌ విచిత్రమైన ధోరణితో చర్చనీయాంశంగా మారింది. ఆ హాస్పిటల్‌లోని నర్సుల ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నర్సింగ్‌హోమ్‌లో జాయిన్ అయిన వృద్ధ రోగులను ఉత్సాహపరిచేందుకు నర్సుల చేత అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తున్నట్టు బయటపడింది. హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్‌లో ఉన్న ఈ నర్సింగ్‌హోమ్‌లో చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Nursing home scandal).


ఈ వీడియోలో, ఒక మహిళా నర్సు స్కూల్ యూనిఫాం లాంటి పొట్టి దుస్తులు ధరించి, బెడ్ మీద కూర్చున్న వృద్ధుడి ముందు అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 'వృద్ధ రోగులు మందులు తీసుకునేలా ప్రోత్సహించడానికి మా డైరెక్టర్ సాధ్యమైనంత వరకు చేస్తున్నారు' అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ నర్సింగ్‌హోమ్‌ ఆన్‌లైన్ ప్రొఫైల్‌లో 'సంతోషకర వృద్ధాశ్రమం' అని రాసి ఉంది. వృద్ధాప్యంలో జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం అలా చేస్తున్నట్టు ఆ నర్సింగ్‌హోమ్‌ పేర్కొంది (elderly care abuse).


ఆ వీడియో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది (nursing home investigation). ఆ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు వృద్ధాశ్రమాలలో కూడా అశ్లీల నృత్యం ఒక ట్రెండ్‌గా ఉందా? అని చాలా మంది ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో, సదరు నర్సింగ్ హోమ్ 100 కి పైగా సంబంధిత వీడియోలను తొలగించింది.


ఇవి కూడా చదవండి..

ఏనుగు vs ఖడ్గమృగం.. ఈ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..


మీకు కశ్మీర్ ఇస్తే ఏం చేసుకుంటారు.. పాకిస్థాన్ టోల్ ప్లాజాపై నెటిజన్ల సెటైర్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2025 | 02:49 PM