China donkey deal Pakistan: చైనాకు రెండు వేల పాకిస్థాన్ గాడిదలు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:44 PM
చైనా తాజాగా పాకిస్థాన్ నుంచి రెండు వేల గాడిదలను కొనుగోలు చేసింది. పాకిస్థాన్ నుంచి చైనా అత్యధికంగా గాడిదలను దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో 2024లో ఈ రెండు దేశాల మధ్య డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం చైనాకు పాకిస్థాన్ 20 వేల గాడిదలను ఎగుమతి చేయాలి.
చైనా తాజాగా పాకిస్థాన్ నుంచి రెండు వేల గాడిదలను కొనుగోలు చేసింది. పాకిస్థాన్ నుంచి చైనా అత్యధికంగా గాడిదలను దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో 2024లో ఈ రెండు దేశాల మధ్య డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం చైనాకు పాకిస్థాన్ 20 వేల గాడిదలను ఎగుమతి చేయాలి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని కరాచీ పోర్ట్‌కు సమీపంలో ఓ భారీ కబేళాను నిర్మించాలని చైనా భావిస్తోంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం 52 లక్షల గాడిదలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక గాడిదలను కలిగిన మూడో దేశంగా పాకిస్థాన్ ఉంది (donkey trade China).
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గాడిదలను దిగుమతి చేసుకునేందుకు చైనా గతేడాది డీల్ కుదుర్చుకుంది. ఇంతకీ గాడిదలతో చైనాకు పనేంటి అనుకుంటున్నారా? చాలా పెద్ద ప్రయోజనమే ఉంది. గాడిద చర్మంతో చైనాలో సాంప్రదాయ ఔషధాలను తయారు చేస్తారు. గాడిద చర్మాన్ని ఉపయోగించి ఎజియావో అనే సాంప్రదాయ ఔషధాన్ని చైనీయులు తయారు చేస్తారు. ఈ ఔషధం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, అలసట, కణితులను తగ్గించడానికి, రక్తహీనత చికిత్సకు సాయపడుతుందని చైనీయులు నమ్ముతారు (donkey slaughterhouses).
ఈ ఎజియావో ఔషధానికి చైనాలో భారీ డిమాండ్ ఉంది (traditional Chinese medicine). అయితే ఈ ఔషధ తయారీకి తగినన్ని గాడిదలు చైనాలో లేవు. దీంతో గాడిదల కోసం పాకిస్థాన్‌పై ఆధారపడుతున్నారు. అయితే చైనా డీల్ కారణంగా పాక్‌లో గాడిదలకు విపరీతమైన డిమాండ్ పెరిగిందట. ఐదేళ్ల క్రితం ఒక్కో గాడిద ఖరీదు రూ.30 వేలుగా ఉండేదట. ప్రస్తుతం పాక్‌లో ఒక్కో గాడిద ఖరీదు రూ.2 లక్షలకు పైగా పలుకుతోందట. దీంతో గాడిదలను ఉపయోగించి పనులు చేసుకుని పాక్ వాసులు కష్టాలు పడుతున్నారట.
ఇవి కూడా చదవండి..
ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే.. టేబుల్ ఫ్యాన్‌ను ఎలా మార్చేశాడో చూడండి..
1990లో కిలో బంగారం కొని ఉంటే.. హర్ష్ గోయెంకా ఆసక్తికర ట్వీట్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..