Home » Chennai News
పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.
ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్‌కోయిల్-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్ ఫాస్ట్ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్‌కోయిల్‌లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
పాకాలవారిపల్లె అటవీ ప్రాంతంలో మంగళవారం బయటపడిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన వారివిగా నిర్దారణ అయింది. ఆదివారం సాయంత్రం ఈ అడవిలో ఓ పురుషుడు శవం చెట్టుకు వేలాడుతుండటం, ఓ మహిళ మృతదేహం సమీపాన పడి ఉండటం, అక్కడే పూడ్చిపెట్టిన రెండు గోతులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
నీలగిరి జిల్లా కూడలూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 12 మందిపై దాడిచేసి హతమార్చిన అడవి ఏగును బందించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రాకేష్ కుమార్ డోగ్రా ఆదేశించారు.
ఊటీకి నిషేధిత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో వచ్చిన కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగలూరు మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, చిక్‌మంగళూరు ఎమ్మెల్యే తదితరలకు ఊటీ మున్సిపల్ అధికారులు జరిమాన విధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో కొత్త పార్టీల చేరిక తదితర అంశాలపై మంగళవారం జరిగిన బీజేపీ చింతనా సమావేశంలో పార్టీ నేతలు సమీక్ష జరిపారు. మహాబలిపురం సమీపంలోని ఓ హాలులో ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్ పర్యటన కోసం తయారు చేసిన రూట్‌మ్యా్‌పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు.
తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.
కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ప్రజలకు తాము చేయబోయే సత్కార్యాలను గురించి చెప్పకుండా డీఎంకేని అదే పనిగా తిట్టడమే ఆనవాయితీగా మారిందని ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా కన్నియాకుమారి రౌండ్‌ఠాణా జంక్షన్ వద్దనున్న విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.