Heavy Rains: 12 వరకు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి..
ABN , Publish Date - Oct 09 , 2025 | 02:48 PM
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షం కురుస్తుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విషయంపై గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
చెన్నై: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షం కురుస్తుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విషయంపై గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
ముఖ్యంగా నీలగిరి(Neelagiri), కోయంబత్తూరు, తేని, దిండిగల్, ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం(Selam), నామక్కల్, తిరుపత్తూరు, రాణిపేట, వేలూరు, కాంచీపురం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనింది. శుక్రవారం కోయంబత్తూరు జిల్లాలోని కొండ ప్రాంతాల్లో, నీలగిరి, తేని, దిండిగల్, మైలాడుదురై, నాగపట్టినం, తిరువారూర్, తంజావూరు,

పుదుక్కోట, కడలూరు జిల్లాలతో పాటు కారైక్కాల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 12 న కోయంబత్తూరు, నీలగిరి, తేని, దిండిగల్, విరుదునగర్, మదురై, శివగంగై జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News