Share News

Udayanidhi: హస్తం పార్టీపై ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు.. ‘చే’జారదు..

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:08 AM

డీఎంకే కూటమి నుంచి హస్తం గుర్తు (కాంగ్రెస్‌) జారిపోదని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దిండుగల్‌ సమీపంలోని వేడచెందూర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన డీఎంకే ప్రముఖుడు స్వామినాధన్‌ ఇంటి వివాహ వేడుకల్లో ఉదయనిధి పాల్గొని వధూవరులకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు.

Udayanidhi: హస్తం పార్టీపై ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు.. ‘చే’జారదు..

చెన్నై: డీఎంకే(DMK) కూటమి నుంచి హస్తం గుర్తు (కాంగ్రెస్‌) జారిపోదని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దిండుగల్‌ సమీపంలోని వేడచెందూర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన డీఎంకే ప్రముఖుడు స్వామినాధన్‌ ఇంటి వివాహ వేడుకల్లో ఉదయనిధి పాల్గొని వధూవరులకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ఇప్పటికే బీజేపీకి బానిసలా మారిందని, కొత్త బానిసల కోసం కమలనాథులు వెతుకుతున్నారని చమత్కరించారు.


కేంద్రప్రభుత్వ బెదిరింపులకు డీఎంకే ఎప్పటికీ భయపడే ప్రసక్తేలేదని, అదేవిధంగా కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు ఇచ్చే గౌరవం కూడా తగ్గబోదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న డీఎంకే కూటమి అలాగే కొనసాగుతుందని, కాంగ్రెస్‌ పార్టీ కూటమి నుంచి బయటికెళ్లే ప్రసక్తేలేదన్నారు.


nani2.2.jpg

అధిక సీట్లు డిమాండ్‌ చేసే మిత్రపక్షాలతో డీఎంకే ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చిస్తుందని, కూటమి అధ్యక్షుడు సీఎం స్టాలిన్‌(CM Stalin) మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు. తమ కూటమే బలమైన కూటమి అని మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం రాత్రి జరిగిన రోడ్‌షోలో ప్రకటించారని, ఆ కూటమిలో చేరిన పార్టీలపై ఇప్పటివరకు స్పష్టతలేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 11:08 AM