Share News

Assembly Elections: బీజేపీ రాష్ట్ర చీఫ్ ప్రచార యాత్రకు పోలీస్ శాఖ అనుమతి

ABN , Publish Date - Oct 09 , 2025 | 02:22 PM

మదురై నుంచి ఈనెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్‌ నాగేంద్రన్‌ ‘తమిళగం నిమిర తమిళనిన్‌ పయనం’ పేరుతో చేపట్టనున్న ప్రచారానికి నగర పోలీసు శాఖ అనుమతులు జారీచేసింది.

Assembly Elections: బీజేపీ రాష్ట్ర చీఫ్ ప్రచార యాత్రకు పోలీస్ శాఖ అనుమతి

చెన్నై: మదురై నుంచి ఈనెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్‌ నాగేంద్రన్‌(BJP State President Nayinar Nagendran) ‘తమిళగం నిమిర తమిళనిన్‌ పయనం’ పేరుతో చేపట్టనున్న ప్రచారానికి నగర పోలీసు శాఖ అనుమతులు జారీచేసింది. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ, వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేలా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి నాగేంద్రన్‌ శ్రీకారం చుట్టారు.


ఆ ప్రకారం, ఈ ప్రచారాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. మదురైలో ప్రారంభించి శివగంగ, చెంగల్పట్టు, చెన్నై ఉత్తరం, సెంట్రల్‌ చెన్నై, పెరంబలూరులో ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, మదురైలో ప్రచారానికి అనుమతులు కోరుతూ మదురై నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో మదురై కార్పొరేషన్‌ జిల్లా అధ్యక్షుడు మారి చక్రవర్తి దరఖాస్తు చేసుకున్నారు.


nani4.2.jpg

దరఖాస్తులో... మదురై కె.పుదూర్‌ బస్టాండ్‌, మునిరోడ్డు జంక్షన్‌, అన్నానగర్‌ అంబికా థియేటర్‌ సహా ఐదు ప్రాంతాల్లో యాత్ర ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన పోలీసు శాఖ, అన్నా నగర్‌ అంబికా థియేటర్‌ జంక్షన్‌లో ప్రచారం ప్రారంభించేందుకు అనుమతించింది. అదే సమయంలో, కార్యకర్తలు తాగునీరు, బిస్కెట్లు అందించాలని, వృద్ధులు, గర్భిణులు, పిల్లలు యాత్రలో పాల్గొనకుండా చూడాలని సహా పలు నిబంధనలను పోలీసు శాఖ విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2025 | 02:22 PM