Chennai News: జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం..‘నాగమలై’
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:56 PM
జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఈరోడ్ జిల్లాలోని నాగమలై కొండను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ బుధవారం ప్రకటన జారీ చేసింది.
చెన్నై: జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఈరోడ్ జిల్లాలోని నాగమలై(Nagamalai) కొండను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ బుధవారం ప్రకటన జారీ చేసింది.
జీవ వైవిధ్య చట్టం 2002 సెక్షన్ 37(1) ప్రకారం అరిడాపట్టిని 2022 నవంబర్‌లో జీవవైవిధ్య వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. 2024 మార్చిలో కాచంపట్టిని, అదే యేడాది సెప్టెంబర్‌లో ఏలత్తూరు చెరువును జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది.

ఈ క్రమంలో ఈరోడ్ జిల్లాలో 32.22 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన నాగమలై కొండను నాలుగో జీవవైవిధ్య వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన జంతువులను, పశుపక్ష్యాదులను సంరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిరక్షణ నిధిని ఏర్పాటు చేసింది. నాగమలై కొండను నాలుగో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం రాష్ట్ర జీవవైవిధ్య పరిరక్షణ ప్రయాణంలో మరో మైలు రాయి అని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

నాగమలైలో ఏముంది?..: నాగమలై కొండ అరుదైన 138 వృక్షజాతులు, 118 పక్షి జాతులు, 7 రకాల క్షీరదాలు, 11 రకాల సరీసృపాలకు నిలయంగా ఉంటోంది. ఇనుప యుగం నాటి ఆనవాళ్లు, గుహలు, రాతియుగం నాటి ఆయుధాలు, గుహలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగమలై కొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతుందని, అదే సమయంలో ఆ కొండపై స్థావరాలు ఏర్పరచుకున్న జంతుజాలాలకు ఎలాంటి ముప్పువాటిల్లకుండా వాటి సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News