Share News

Assembly Elections: మాజీసీఎం రోడ్‌షోలో టీవీకే జెండాలు..

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:35 AM

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రోడ్‌షోలో తమిళగ వెట్రి కళగం (టీవీకే)జెండాలు రెపరెపలాడటం చర్చనీయాంశమైంది. రెండేళ్లుగా పార్టీని నడుపుతున్న విజయ్‌ వ్యవహారశైలి అంతుబట్టని విధంగా మారింది.

Assembly Elections: మాజీసీఎం రోడ్‌షోలో టీవీకే జెండాలు..

- కూటమికి శ్రీకారం చుట్టినట్లుగా ఉందన్న అన్నాడీఎంకే శ్రేణులు

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) రోడ్‌షోలో తమిళగ వెట్రి కళగం (టీవీకే)జెండాలు రెపరెపలాడటం చర్చనీయాంశమైంది. రెండేళ్లుగా పార్టీని నడుపుతున్న విజయ్‌(Vijay) వ్యవహారశైలి అంతుబట్టని విధంగా మారింది. ఆదిలో అన్నాడీఎంకేతో సఖ్యతగా వున్న ఆయన.. ఆ తరువాత ఆ పార్టీతో పాటు బీజేపీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల కరూర్‌ తొక్కిసలాట అనంతరం అన్నాడీఎంకే, బీజేపీలు టీవీకేకు అండగా నిలిచినట్లుగా కనిపిస్తోంది.


nani3.2.jpg

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రచారానికి వెళుతున్న ఈపీఎ్‌సను టీవీకే కార్యకర్తలు ప్లకార్డులు, బ్యానర్లతో ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నామక్కల్‌ జిల్లా కుమారపాళయంలో బుధవారం రాత్రి ఈపీఎస్‌(EPS) పాల్గొన్న రోడ్‌షోలో టీవీకే జెండాలు కనిపించాయి.


nani3.jpg

వాటిని చూపించిన ఈపీఎస్‌ ఇది కూటమికి శ్రీకారం చుట్టినట్లుగా ఉందని పేర్కొనడంతో చుట్టూ ఉన్న పార్టీ శ్రేణులు కరతాళధ్వనులతో హర్షంవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మాట్లాడుతూ, డీఎంకే నేతృత్వంలోని కూటమి బలమైనదని సీఎం స్టాలిన్‌ భావిస్తున్నారని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వరించే కూటమి అన్నాడీఎంకే నేతృత్వంలో ఏర్పడనున్నదని ధీమావ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 11:35 AM