BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. హీరో, టీవీకే అధినేత విజయ్‌కు ప్రాణహాని
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:49 AM
టీవీకే అధినేత విజయ్‌కు ప్రాణహాని ఉందని, ఆ అనుమానంతోనే ఆయన కరూర్ వెళ్లేందుకు భద్రత కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో గురువారం నయినార్ నాగేంద్రన్ విలేఖరులతో మాట్లాడుతూ... కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనలో విజయ్ ఇంకా బాధితులను పరామర్శించలేదన్నారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: టీవీకే అధినేత విజయ్‌కు ప్రాణహాని ఉందని, ఆ అనుమానంతోనే ఆయన కరూర్ వెళ్లేందుకు భద్రత కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో గురువారం నయినార్ నాగేంద్రన్ విలేఖరులతో మాట్లాడుతూ... కరూర్(Karoor) తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనలో విజయ్ ఇంకా బాధితులను పరామర్శించలేదన్నారు. తొక్కిసలాటను వంకగా చూపించి, విజయ్‌ను రాజకీయాల నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు.

విజయ్ కరూర్‌కు వెళితే ఆయన ప్రాణాలకు గ్యారంటీ లేదన్నారు. ఈ వ్యవహారంలో డీఎంకే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని ఆరోపించారు. అన్నాడీఎంకే సభలో టీవీకే జెండాలు ఎగురవేశారని, ఈ ఘటన కార్యకర్తల ఉత్సాహానికి చిహ్నంగా ఉందన్నారు. ప్రస్తుతం కార్యకర్తలుగా ఉన్న వారు ప్రజా ప్రతినిధులవుతారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారన్నారు. ఎవరెన్ని చెప్పినా డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని తిరుమావళవన్ చెబుతున్నారని, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆయన గెలుస్తామని చెబుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు.

12 నుంచి ప్రచార యాత్ర
మదురై నుంచి ఈ నెల 12 నుంచి తన ప్రచార యాత్ర ప్రారంభమవుతుందని నయినార్ నాగేంద్రన్ తెలిపారు. యాత్ర ప్రారంభోత్సవానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రావాల్సివుందని, కానీ బిహార్ ఎన్నికల ప్రచారం కారణంగా ఆయన పర్యటన రద్దయిందని తెలిపారు. అందువల్ల ప్రచార యాత్రను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారన్నారు. తన ప్రచార యాత్రకు పలు నిబంధనలు విధించారని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ విధించిన నిబంధనల మేరకు తన యాత్ర సాగుతుందని నాగేంద్రన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News