Home » Central Govt
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పన్నుల శాఖ సంస్కరణలను జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన ఉందని వ్యాఖ్యానించారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.
దేశంలో నగర వైమానిక రవాణా రంగంలో ఒక సరికొత్త శకానికి తెరలేవబోతోంది. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. P2P యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితమని క్లారిటీ ఇచ్చింది.
పార్లమెంట్‌లో ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026కు ఆమోదించడంపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వాగతించారు. నూతన చట్టంతో ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన రక్షణ, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
చిన్న తరహా పరిశ్రమలు, చేతివృత్తుల కళాకారులు, రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సవరించింది.
వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.