Maoist Party: మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ.. లొంగిపోయిన అగ్రనేత
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:27 PM
మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ రాజ్ పోలీసులకు సోమవారం లొంగిపోయారు. రామ్‌ధేర్‌తో పాటు మరో 12 మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు లొంగిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి (Maoist Party) మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ రాజ్ పోలీసులకు ఇవాళ(సోమవారం) లొంగిపోయారు. రామ్‌ధేర్‌తో పాటు మరో 12మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు లొంగిపోయారు. రామ్‌ధేర్ ఎంఎంసీ జోన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయనపై రూ.కోటికి పైగా రివార్డ్ ఉంది. రామ్‌ధేర్ కీలక నక్సలైట్ దాడుల్లో పాల్గొన్నారు. రామ్‌ధేర్ రాజ్ ఛత్తీస్‌గఢ్‌లోని నందగావ్‌లోని సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.
కాగా, మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టుల చర్యలను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిచెందారు. హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టు కీలక నేతలు ఎన్‌కౌంటర్ అయ్యారు. భద్రత బలగాల చర్యలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే రామ్‌ధేర్‌తో పాటు పలువురు నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
For More TG News And Telugu News