Home » CBI
కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సవాలు చేసింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. తక్షణం పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టును కోరింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..
శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం విచారణ జరగుతోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.
అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్‌లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
విజయ్‌ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సీబీఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిమిత్తం.. తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి సీబీఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు విజయ్‌ని విచారించి.. ఆయన వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.
కల్తీ నెయ్యిపై సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరింది. అలిపిరి కార్యాలయంలో ఉదయం నుంచీ సీబీఐ జేడీ వీరేశ్ ప్రభు సమీక్షిస్తున్నారు. ఈ కేసుపై త్వరలో చార్ట్ షీట్ వేయనుండడంతో ఇప్పటిదాకా సాగిన దర్యాప్తుపై సిట్ బృందంతో చర్చిస్తున్నారు.