CBI Arrest: మాజీ ఎంపీ కుమారుడు, కోడలు అరెస్ట్..
ABN , Publish Date - Dec 22 , 2025 | 08:17 PM
దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో అరెస్టు చేసినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు (Adikesavulu Naidu) కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సీబీఐ అధికారులు (CBI Officials) ఇవాళ(సోమవారం) అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో అరెస్టు చేసినట్లు సమాచారం. 2019 మే 4వ తేదీన అనుమానాస్పద రీతిలో రఘునాథ్ మృతిచెందాడు. దీంతో రఘునాథ్ భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంజుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తన భర్త మరణంపై శ్రీనివాస్‌తో పాటు పలువురు కారణమని మంజుల ఫిర్యాదులో తెలిపారు. 2020 నుంచి ఈకేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు సీబీఐ అధికారుల దగ్గరికి వచ్చింది. రఘునాథ్ మృతిపై చార్జిషీట్ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. సీబీఐ కోర్టు ఆదేశాలతో శ్రీనివాస్, కల్పజతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి వాటిపై సీబీఐ అధికారులు శ్రీనివాస్, కల్పజలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News