Home » Business news
శీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలనే మూటగట్టుకున్నాయి. అధిక ముడి చమురు ధరలు, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన శాంతి ఒప్పందంపై అనిశ్చితి, అమెరికా బాండ్ల వడ్డీ రేట్లు పెరగడం, విదేశీ నిధులు తరలిపోవడం వంటివి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో కూడిన అల్యూమినియం స్మెల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) యోచిస్తోంది.
NCLAT Issues Notices to Subhash Chandra’s Creditorsసుభాష్ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు
తెలంగాణ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న టెక్నోపెయింట్స్ అండ్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో భారత మార్కెట్లో మొబైల్ ఫోన్ల ధరలు సగటున 16శాతం పెరిగాయని మార్కెట్ పరిశోధక సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది
అమెరికన్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సంబంధించిన కేసుల నుంచి అదానీ గ్రూప్ క్రమంగా బయటపడుతోంది. తాజాగా గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీకీ ఊరట లభించింది.
బంగారం ధర అనూహ్యంగా పెరగడంతో ఆభరణ ప్రియుల మనసు క్రమంగా వెండి పైకి మళ్లుతోంది. పేదోడి బంగారంగా పేరున్న వెండి.. ఇప్పుడు మధ్యతరగతి, సంపన్న వర్గాలనూ ఆకర్షిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ పవర్ మెక్ ప్రాజెక్ట్స్.. అదానీ గ్రూప్‌నకు చెందిన మోక్సీ పవర్ జెనరేషన్ నుంచి రూ.549.37 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ప్రకటించింది
రుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ వ్యయాలు భారంగా మారుతుండటంతో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో నడిచాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రోజంతా హెచ్చుతగ్గులకు లోనై లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిసాయి.