Share News

ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలపైనే ఏఐ ప్రభావం

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:58 AM

ఉద్యోగ నియామకాలపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది అందరూ భయపడేంత భారీ స్థాయిలోగాక పరిమిత స్థాయిలో మాత్రమే కనిపిస్తోందని ఒక నివేదిక తెలిపింది...

ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలపైనే ఏఐ ప్రభావం

మానవ నైపుణ్యాలకు అది ప్రత్యామ్నాయం కాదు

ఇక్రియెర్‌ నివేదిక

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది అందరూ భయపడేంత భారీ స్థాయిలోగాక పరిమిత స్థాయిలో మాత్రమే కనిపిస్తోందని ఒక నివేదిక తెలిపింది. ఏఐ ముఖ్యంగా జనరేటివ్‌ ఏఐని ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచే సాధనంగా చూడాలే తప్ప, మానవ సృజనకు ప్రత్యామ్నాయంగా చూడలేమని స్పష్టం చేసింది. ఓపెన్‌ ఏఐ సంస్థ మద్దతుతో భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలి (ఇక్రియెర్‌) రూపొందించిన నివేదిక ఈ విషయం పేర్కొంది. గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 650 ఐటీ కంపెనీల నియామకాల తీరుతెన్నులను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు.

నిపుణులకు ఢోకా లేదు

ఈ నివేదిక కోసం సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 63ు కీలక పనుల కోసం ఏఐని వినియోగిస్తున్నట్టు చెప్పాయి. దీంతో నియామకాలు ముఖ్యంగా ఎంట్రీ లెవల్‌ ఉద్యోగ నియామకాలు తగ్గినట్టు తెలిపాయి. ఇదే సమయంలో ఏఐ, డేటా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు మాత్రం మంచి డిమాండ్‌ ఏర్పడింది. నియామకాల్లో చోటు చేసుకుంటున్న ఈ మార్పులతో మిడ్‌, సీనియర్‌ ఉద్యోగులు కంపెనీలు మారడం బాగా తగ్గిపోయింది. ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్లకు కూడా ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉందని ఆ నివేదిక తెలిపింది.

నేటి నుంచి ఏఐ ఎక్స్‌పో

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో’ ప్రారంభమవుతోంది. స్థానిక భారత్‌ మండపంలో జరిగే ఈ ఎక్స్‌పోని ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తారు. దేశ. విదేశాలకు చెందినే పలువురు ప్రముఖులతో పాటు దాదాపు 600 స్టార్టప్‌ కంపెనీలు ఈ ఎక్స్‌పోలో తమ సరికొత్త ఏఐ టూల్స్‌ను ప్రదర్శించబోతున్నాయి. ఈ నెల 20 వరకు ఈ ఎక్స్‌పో జరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 03:59 AM