Share News

మళ్లీ పెరిగిన పసిడి ధరలు..

ABN , Publish Date - Feb 15 , 2026 | 06:34 AM

అమెరికన్ కరెన్సీ డాలర్ బలహీనపడిన నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లల్లో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

మళ్లీ పెరిగిన పసిడి ధరలు..
Gold, Silver Rates on Feb 15

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, డాలర్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా భారత్‌లో శనివారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర సగటున రూ.1900 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,57,750కు చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.1,970 అధికం. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.1,800ల మేర పెరిగి రూ.1,44,600కు చేరుకుంది. నగరంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,80,000 వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates on Feb 15).

అమెరికన్ కరెన్సీ డాలర్ బలహీనపడ్డ నేపథ్యంలో పసిడి, వెండివైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా సోమవారం నుంచీ బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారం, వెండిలపై ఇన్వెస్ట్ చేసే వారు డాలర్ విలువపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు (24కే, 22కే)

  • చెన్నై: ₹1,58,840; ₹1,45,600

  • ముంబై: ₹1,57,750; ₹1,44,600

  • న్యూఢిల్లీ: ₹1,57,900; ₹1,44,750

  • కోల్‌కతా: ₹1,57,750; ₹1,44,600

  • బెంగళూరు: ₹1,57,750; ₹1,44,600

  • హైదరాబాద్: ₹1,57,750; ₹1,44,600

  • విజయవాడ: ₹1,57,750; ₹1,44,600

  • కేరళ: ₹1,57,750; ₹1,44,600

  • పుణే: ₹1,57,750; ₹1,44,600

  • వడోదరా: ₹1,57,800; ₹1,44,650

  • అహ్మదాబాద్: ₹1,57,800; ₹1,44,650

వెండి ధరలు

  • చెన్నై: ₹2,80,000

  • ముంబై: ₹2,75,000

  • న్యూఢిల్లీ: ₹2,75,000

  • కోల్‌కతా: ₹2,75,000

  • బెంగళూరు: ₹2,75,000

  • హైదరాబాద్: ₹2,80,000

  • విజయవాడ: ₹2,80,000

  • కేరళ: ₹2,80,000

  • పుణే: ₹2,75,000

  • వడోదరా: ₹2,75,000

  • అహ్మదాబాద్: ₹2,75,000


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలను తెలుసుకోవాలని సూచన.

ఇవీ చదవండి:

బ్యాంకు డిపాజిట్లపై జర జాగ్రత్త.. లిమిట్ దాటితే ఐటీ నోటీసులు

నాట్కో నుంచి సెమాగ్లుటైడ్‌ ఔషధం

Updated Date - Feb 15 , 2026 | 07:29 AM