Share News

నాట్కో నుంచి సెమాగ్లుటైడ్‌ ఔషధం

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:47 AM

టైప్‌-2 మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఔషధం ‘సెమాగ్లుటైడ్‌’కు జనరిక్‌ వెర్షన్‌ తయారీతోపాటు దాన్ని భారత్‌లో విక్రయించేందుకు...

నాట్కో నుంచి సెమాగ్లుటైడ్‌ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టైప్‌-2 మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఔషధం ‘సెమాగ్లుటైడ్‌’కు జనరిక్‌ వెర్షన్‌ తయారీతోపాటు దాన్ని భారత్‌లో విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా లిమిటెడ్‌కు అనుమతి లభించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ) నుంచి తమకు ఈ అనుమతి లభించిందని నాట్కో వెల్లడించింది. జనరిక్‌ సెమాగ్లుటైడ్‌ ఇంజక్షన్‌ను ఈ మార్చిలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.

భారత్‌లో భారీ డిమాండ్‌: అంతర్జాతీయ ఔషధ దిగ్గజం నోవో నార్డిస్క్‌.. ఒజెంపిక్‌, వెగోవీ, రైబెల్సస్‌ పేర్లతో విక్రయిస్తున్న సెమాగ్లుటైడ్‌ ఇంజెక్షన్లకు భారత్‌లో భారీ డిమాండ్‌ నెలకొంది. ఈ మార్చితో దీని పేటెంట్‌ హక్కుల కాలపరిమితి ముగియనుండటంతో నాట్కోతో పాటు పలు దేశీయ ఫార్మా కంపెనీలు జనరిక్‌ సెమాగ్లుటైడ్‌ వెర్షన్లను మన మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి..

ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?

Updated Date - Feb 15 , 2026 | 04:47 AM