Share News

ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:47 AM

ప్రపంచ మార్కెట్ల నుంచి వరుసగా ప్రతికూల సంకేతాలు వస్తున్న కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ ఆటుపోట్లకు లోనయ్యే...

ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

ప్రపంచ మార్కెట్ల నుంచి వరుసగా ప్రతికూల సంకేతాలు వస్తున్న కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశముంది. అమెరికా, జపాన్‌ దేశాల్లో బాండ్‌ రాబడులు పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం, ఐటీ షేర్లు కుప్పకూలడం వంటివి కీలకంగా మారాయి. క్రితం వారం ఐటీ సూచీ ఏకంగా 8ు పతనమైంది. మీడియా, పీఎ్‌సయూ బ్యాంకులు, ఆటో, హెల్త్‌కేర్‌ సూచీలు రాణించాయి. మదుపరులు ఎంపిక చేసిన స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టాలి.

స్టాక్‌ రికమెండేషన్స్‌

టెక్‌ మహీంద్రా: స్వల్ప పుల్‌బ్యాక్‌ తర్వాత మంచి మూమెంటమ్‌ ప్రదర్శించిన ఈ కౌంటర్‌లో రూ.1830 వద్ద నిరోధం ఎదురైంది. ఐటీ సూచీ పతనం ప్రభావం దీనిపై పడింది. అయితే క్రితం సెషన్లో మెరుగ్గా రాణించి రూ.1534 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు రూ. 1650/1720 టార్గెట్‌ ధరతో రూ.1500 శ్రేణిలో పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.1470.

బజాజ్‌ ఫైనాన్స్‌: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేర్లలో 20ు మేర దిద్దుబాటు జరిగింది. కీలక స్థాయి రూ.932 వద్ద మద్దతు తీసుకుని మళ్లీ అప్‌ట్రెండ్‌ బాట పట్టింది. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తోంది. చివరి పది సెషన్లలోనే 16ు రాబడినిచ్చింది. గత శుక్రవారం రూ.1024 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1100 టార్గెట్‌ ధరతో రూ.980పై స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.960.

యూబీఎల్‌: జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 38ు దిద్దుబాటుకు లోనైన ఈ షేర్లు ప్రస్తుతం దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తున్నాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ అనూహ్యంగా పుంజుకున్నాయి. చివరి 13 సెషన్లలో 18ు మేర రాబడినందించాయి. గత శుక్రవారం రూ.1628 ముగిసిన ఈ కౌంటర్లో రూ.1680 టార్గెట్‌ ధరతో రూ.1600 శ్రేణిలో పొజిషన్‌ తీసుకోవాలి. స్టాప్‌లాస్‌ : రూ.1575.


బయోకాన్‌: కొన్ని నెలలుగా ఈ షేర్లు పరిమిత పరిధిలోనే కదలాడుతున్నాయి. ప్రస్తుతం ట్రయాంగిల్‌ పాటర్న్‌ ఏర్పడింది. ఫలితాలు విడుదలవడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. క్రితం సెషన్లో రూ.377 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.415/425 టార్గెట్‌ ధరతో రూ.370 శ్రేణిలో కొనుగోలు చేయాలి. స్టాప్‌లాస్‌ : రూ.350.

టోరెంట్‌ ఫార్మా: జీవితకాల గరిష్ట స్థాయి నుంచి 40ు పతనమైన ఈ షేర్లు ప్రస్తుతం టర్న్‌ అరౌండ్‌ అయ్యాయి. తిరిగి అప్‌ట్రెండ్‌ బాటపట్టాయి. చివరి మూడు నెలల్లో 20ు మేర రాణించాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.1462 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో రూ.1600 టార్గెట్‌ ధరతో రూ.1460 వద్ద పొజిషన్‌ తీసుకోవచ్చు.

స్టాప్‌లాస్‌ : రూ.1430.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 03:47 AM