బంగారం లక్ష దిగేనా?
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:52 AM
‘పెరుగుట విరుగుట కొరకే’ అనే సూక్తి బంగారం విషయంలో నిజం కానుందా... పసిడి మార్కెట్ కుప్పకూలనుందా బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ప్రచురించిన ఒక కథనం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది....
డాలర్ల చెల్లింపులకు రష్యా సై అనడం కారణమంటున్న పరిశీలకులు
‘పెరుగుట విరుగుట కొరకే’ అనే సూక్తి బంగారం విషయంలో నిజం కానుందా... పసిడి మార్కెట్ కుప్పకూలనుందా బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ప్రచురించిన ఒక కథనం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తన అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతున్నట్టు బ్లూమ్‌బర్గ్ ఒక వార్తా కథనం ప్రచురించింది. ఇలాంటి కథనాలపై వెంటనే స్పందించే రష్యా, ఈ కథనంపై పూర్తి మౌనం పాటిస్తోంది. దీంతో అంతర్జాతీయ పరిశీలకులు సైతం బహుశా ఇది నిజమే కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర పతనానికి ఇదే ప్రధాన కారణమనే వాదన సైతం వినిపిస్తోంది.
గత నెల చివర్లో ఒక దశలో మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజిలో (ఎంసీఎక్స్) రూ.1,80,779కి చేరిన 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) గత శుక్రవారం రూ.1,56,200 వద్ద ముగిసింది. బ్లూమ్‌బర్గ్ వార్తా కథనం నిజమైతే ఫ్యూచర్ మార్కెట్లతో పాటు, స్పాట్ మార్కెట్‌లోనూ పసిడి ధరల భారీ పతనం తప్పదని మార్కెట్ వర్గాల అంచనా. ‘మన దేశంలో పసిడి ధర ఇప్పటికే 15ు తగ్గింది. రష్యా డాలర్ల సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోవడం నిజమైతే ముందుగా గోల్డ్ ఈటీఎ్‌ఫల్లో భారీ అమ్మకాలు పోటెత్తుతాయి. ఆ ప్రభావం ఫిజికల్ గోల్డ్ ధరలపై పడి వచ్చే ఏడాది చివరికి దేశంలో 10 గ్రాముల పసిడి ధర రూ.లక్ష దిగువకు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ పసిడి ధర అప్పటికి 3,000 డాలర్లకు తగ్గవచ్చు’ అని బ్రోకరేజి సంస్థ పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అంచనా.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..