Share News

మేఘా గ్రూప్‌ కంపెనీలో జేడీ లక్ష్మీ నారాయణ

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:43 AM

ఐపీఎస్‌ మాజీ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు...

మేఘా గ్రూప్‌ కంపెనీలో జేడీ లక్ష్మీ నారాయణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఐపీఎస్‌ మాజీ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. మేఘా ఇంజినీరింగ్‌ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఆపరేషన్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా చేరారు. ఈ కంపెనీ ఒలెకా్ట్ర పేరుతో ఎలక్ట్రిక్‌ బస్సులు తయారు చేసి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణ సంస్థలకు సరఫరా చేస్తుంది. వైఎ్‌సఆర్‌ సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కేసు దర్యాప్తుతో జేడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఉద్యోగానికి మధ్యలోనే రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జనసేన తరఫున విశాఖ లోక్‌సభ ఎంపిగా పోటీ పడినా ఆయనకు కలిసి రాలేదు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టినా పెద్దగా రాణించలేదు. దీంతో లక్ష్మీ నారాయణ రాజకీయాలకు స్వస్తి చెప్పి కార్పొరేట్‌ రంగాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 03:43 AM