టెక్ వ్యూ 25500 పైన నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:37 AM
గత వారం నిఫ్టీ మానసిక అవధి 26,000 వరకు వెళ్లినా నిలదొక్కుకోవడంలో విఫలం కావడమే కాకుండా అంత కన్నా దిగువనే ముగిసింది. ఇది అప్రమత్త సంకే తం. చివరి రెండు రోజుల్లో 500 పాయింట్ల మేరకు...
గత వారం నిఫ్టీ మానసిక అవధి 26,000 వరకు వెళ్లినా నిలదొక్కుకోవడంలో విఫలం కావడమే కాకుండా అంత కన్నా దిగువనే ముగిసింది. ఇది అప్రమత్త సంకే తం. చివరి రెండు రోజుల్లో 500 పాయింట్ల మేరకు కరెక్షన్ సాధించి వారం మొత్తం మీద 220 పాయింట్ల నష్టంతో 25,470 వద్ద ముగిసింది. నిఫ్టీ ప్రస్తు తం ఇటీవల నమోదైన గరిష్ఠ స్థాయి 26,500, కనిష్ఠ స్థాయి 24,500 మధ్యన నిలిచి ఉంది. ఇది అనిశ్చిత ధోరణికి సంకేతం. సుమారు గత ఏడాది కాలం నుంచి ప్రధాన సైడ్‌వేస్ ధోరణిలో ట్రేడవుతున్న నిఫ్టీ ప్రధాన దిశ తీసుకునేందుకు ప్రస్తుతం సమాయత్తం అవుతోంది. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్ ఆధారంగా ఈ వారం మార్కెట్ పాజిటివ్‌గా ప్రారంభమై కీలక స్థాయి 25,500 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ ప్రస్తుతం 25,500 వద్ద నిలిచి ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. మైనర్ నిరోధ స్థాయి 25,650. ఆ పైన 25,800. ప్రధాన స్వల్పకాలిక నిరోధం 26,000.
బేరిష్ స్థాయిలు: భద్రత కోసం మార్కెట్ 25,500 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 25300, 25000. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం 61,000 నుంచి రియాక్షన్ సాధించిన ఈ సూచీ 60,200 వద్ద వారానికి ముగిసింది. జీవితకాల గరిష్ఠ స్థాయిల వద్ద నిలకడగా ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం నిరోధ స్థాయి 60,600 కన్నా పైన నిలదొక్కుకోవాలి. బలంగా కనిపిస్తున్న ప్రధాన నిరోధం 61,000. ప్రధాన మద్దతు స్థాయిలు 59600, 59000.
పాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 100, 200 డిఎంఏల వద్ద మరో పరీక్ష ఎదుర్కొనవచ్చు. సానుకూలత కోసం ఈ స్థాయిల కన్నా పైన నిలదొక్కుకోవాలి. అలాగే 25,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవడం కీలకం.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25580, 25650
మద్దతు : 25500, 25410
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..