Home » Business news
మన దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు చాలా ముఖ్యం. ఈ రెండు కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు పొందడంలో గానీ, గుర్తింపు విషయంలో గానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో గానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గత సెషన్లో విదేశీ మదుపర్లు మాత్రం రూ.317 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే సంవత్సరాంతం కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి.
అదానీ గ్రూప్ భారత రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మానవరహిత అటానమస్ వ్యవస్థలు.. ఏఐ ఆధారిత కార్యకలాపాలు, విమాన ఇంజిన్ల నిర్వహణ-మరమ్మతు-ఓవర్‌హాలింగ్..
ఆన్ లైన్ ట్రేడింగ్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా ఈడీ.. 26 క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్రాస్-బార్డర్ మనీ ట్రైల్‌ను గుర్తించింది.
ఓవైపు బంగారం.. మరోవైపు వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. తగ్గినట్లే తగ్గి.. రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల కంటే వెండి ధరలు హడలెత్తిస్తున్నాయి. సిల్వర్ ప్రైజ్.. రోజూ సర్ప్రైజ్ ఇస్తోంది.
వరుసగా మూడు సెషన్ల పాటు కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపర్లు మంగళవారం మాత్రం రూ.1794 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే ఐటీ, ఫార్మా, ఆయిల్ రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. ఇక, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
హైదరాబాద్ నగర వాసులు 2025 సంవత్సరంలో అత్యధికంగా కొనుగోళ్లు చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నివేదిక వెల్లడించింది. ఆన్లైన్లో కొనుగోలుకు ఆయా సంస్థలు ఉన్నప్పటికీ ఎక్కువగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఎంచుకోవడం గమనార్హం.
సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్‌లో సచిన్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని..
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగతూ వస్తున్న ఐటీ రంగంలో లాభాల స్వీకరణ జరిగింది. హెవీ వెయిట్ ఐటీ కంపెనీల్లో లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి.
2026లో అమెరికా ఫెడ్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వెలువడుతున్న అంచనాలు మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఐటీ రంగ షేర్లపై ఆసక్తి, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి.