Share News

కొత్త ఔషధాల అభివృద్ధికి జీసీసీల దన్ను కేపీఎంజీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:24 AM

కొత్త ఔషధాల అభివృద్ధిలో దేశంలోని ఫార్మా, లైఫ్‌ సైన్సె్‌సకు చెందిన గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాలది (జీసీసీ) కీలక పాత్ర అని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తెలిపింది. ప్రస్తుతం...

కొత్త ఔషధాల అభివృద్ధికి జీసీసీల దన్ను కేపీఎంజీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : కొత్త ఔషధాల అభివృద్ధిలో దేశంలోని ఫార్మా, లైఫ్‌ సైన్సె్‌సకు చెందిన గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాలది (జీసీసీ) కీలక పాత్ర అని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తెలిపింది. ప్రస్తుతం కొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధికి 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతోంది. జీసీసీలు అందించే ఏఐ ఆధారిత సేవలతో ఇందుకు పట్టే సమయం ఏడాది నుంచి రెండేళ్లకు తగ్గుతుందని పేర్కొంది. దీంతో పరిశోధన, అభివృద్ధి ఖర్చులు కూడా ఐదు శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. జీసీసీల మద్దతుతో పరిశోధన, అభివృద్ధి, ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ సమయం ఐదారేళ్లు, క్లినికల్‌ ట్రయల్స్‌ సమయం నాలుగు నుంచి ఆరేళ్ల వరకు తగ్గవచ్చని కేపీఎంజీ అంచనా.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 19 , 2026 | 03:24 AM