Share News

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి జనరిక్‌ ‘వెగోవీ’

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:19 AM

స్థూల కాయం తగ్గించే నోవో నార్డిస్క్‌ కంపెనీ ‘వెగోవీ’ బ్లాక్‌బస్టర్‌ ఔషధానికి త్వరలో జనరిక్‌ వెర్షన్‌ రానుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డాక్డర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఈ జనరిక్‌ వెర్షన్‌ వెగోవీ...

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి జనరిక్‌ ‘వెగోవీ’

60 శాతం తక్కువ ధరతో విడుదల!

ముంబై: స్థూల కాయం తగ్గించే నోవో నార్డిస్క్‌ కంపెనీ ‘వెగోవీ’ బ్లాక్‌బస్టర్‌ ఔషధానికి త్వరలో జనరిక్‌ వెర్షన్‌ రానుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డాక్డర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఈ జనరిక్‌ వెర్షన్‌ వెగోవీ ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేయనుంది. దీని ధర బ్రాండెడ్‌ వెగోవీ కంటే 50 నుంచి 60 శాతం తక్కువగా ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ప్రస్తుతం నోవో నార్డిస్క్‌ కంపెనీ వెగోవీ బ్రాండెడ్‌ వెయిట్‌ లాస్‌ ఔషఽధం కోసం డోసేజిని బట్టి నెలకు రూ.10,850 నుంచి రూ.16,400 ఖర్చు చేయాల్సి వస్తోంది. వచ్చే నెలతో ఆ కంపెనీకి వెగోవీపై పేటెంట్‌ హక్కులు తీరిపోతాయి. దీంతో పలు భారత ఔషధ కంపెనీలు దీనికి ప్రత్యామ్నాయంగా చౌకగా జనరిక్‌ ఔషధాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 19 , 2026 | 03:19 AM