భారత్‌తో విస్తృత భాగస్వామ్యాలు: ఎన్‌విడియా
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:01 AM
భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, స్టార్ట్‌పలు, భాగస్వాములు కలిగి ఉన్న భారత్ ఏఐ ఆవిష్కరణలకు అత్యంత కీలక కేంద్రాల్లో ఒకటిగా మారిందని...
భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, స్టార్ట్‌పలు, భాగస్వాములు కలిగి ఉన్న భారత్ ఏఐ ఆవిష్కరణలకు అత్యంత కీలక కేంద్రాల్లో ఒకటిగా మారిందని ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా దక్షిణాసియా విభాగం ఎండీ విశాల్ ధుపర్ అన్నారు. భారత్ ఏఐ పెట్టుబడులను ప్రస్తుత 120 కోట్ల డాలర్ల స్థాయి నుంచి మరింతగా పెంచాలని ఎన్‌విడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ త్రివేదీ చెప్పారు. భారత్‌లో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచానికి సేవలందించే కంపెనీలకు 20 ఏళ్ల పాటు పన్ను రాయితీ కల్పించనున్నట్లు ఈ సారి బడ్జెట్లో ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం