మూడో రోజూ లాభాలే
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:11 AM
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 283.29 పాయింట్ల లాభంతో 83,734.25 వద్ద ముగియగా నిఫ్టీ 50 సూచీ 93.95 పాయింట్ల...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 283.29 పాయింట్ల లాభంతో 83,734.25 వద్ద ముగియగా నిఫ్టీ 50 సూచీ 93.95 పాయింట్ల లాభంతో 25,819.35 వద క్లోజయింది. ట్రేడింగ్ చివర్లో బ్యాంకింగ్, మెటల్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం బుధవారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించింది. రుణ వసూళ్లు సానుకూలంగానే ఉంటాయన్న అంచనాలు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ కంపెనీల షేర్లను లాభాల బాట పట్టించాయి. దీనికి తోడు ఇటీవల కరెక్షన్‌కు లోనైన కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు సైతం మార్కెట్ వృద్ధికి ఊతంగా నిలిచాయి.