• Home » Budget 2026

Budget 2026

కేరళ ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యం.. బడ్జెట్‌పై శశిథరూర్

కేరళ ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యం.. బడ్జెట్‌పై శశిథరూర్

ఒక మలయాళీగా తనకు బడ్జెట్ సంతృప్తి కలిగించలేదని శశిథరూర్ అన్నారు. బడ్జెట్‌లో కేరళ ప్రస్తావనే లేకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

భారత్‌లోని డేటా సెంటర్ల ద్వారా గ్లోబల్ కస్టమర్లకు క్లౌడ్ సర్వీసులు అందించే సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో తెలిపారు. అంతేకాకుండా, బీఈఎస్ వ్యవస్థల్లోని లిథియం అయాన్ సెల్స్‌ తయారీకి వాడే వస్తువులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్టు తెలిపారు.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు బ్లాక్ డేగా బడ్జెట్ డే.!

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు బ్లాక్ డేగా బడ్జెట్ డే.!

కేంద్రం.. బడ్జెట్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక ఆదివారం నాడు మదుపర్లకు భారీ షాక్‌నిచ్చాయి స్టాక్ మార్కెట్లు. నేడు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లకు బ్లాక్ సండే అయింది.

కేంద్ర బడ్జెట్ భేష్.. నిర్మలమ్మపై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు..

కేంద్ర బడ్జెట్ భేష్.. నిర్మలమ్మపై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు..

కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రశంసిస్తూ పౌర విమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థిరమైన ఆర్థిక విధానం, సుస్థిర అభివృద్ధిని తీసుకురాగలిగిందని అన్నారు.

అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ

అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ

బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టడం జరిగిందని, మూడు కారిడార్లంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ అన్నారు.

 2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు.

కేంద్ర బడ్జెట్ 2026తో ధరలు పెరిగేవి, ధరలు తగ్గేవి ?

కేంద్ర బడ్జెట్ 2026తో ధరలు పెరిగేవి, ధరలు తగ్గేవి ?

ఇవాళ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రధానంగా 'మౌలిక సదుపాయాలు', 'ఉపాధి కల్పన', 'సరళీకృత పన్ను విధానం' చుట్టూ తిరిగింది. వివిధ వర్గాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం.. బడ్జెట్‌పై ప్రధాని మోదీ

140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం.. బడ్జెట్‌పై ప్రధాని మోదీ

ఈ బడ్జెట్ 'పుష్కలమైన అవకాశాలకు హైవే' అని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చేలా భారతదేశ ఉజ్వల భవితకు గట్టి పునాదిని వేసిందన్నారు.

బడ్జెట్ 2026: ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే..

బడ్జెట్ 2026: ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు..

బడ్జెట్ 2026:  ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం

బడ్జెట్ 2026: ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం

బడ్జెట్ 2026లో భారతదేశాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన చేశారు. పదేళ్లలో భారత క్రీడారంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి