Share News

బడ్జెట్ 2026: ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే..

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:58 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు..

బడ్జెట్ 2026: ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే..
Budget 2026 sector-wise allocation

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు రూ.28.70 లక్షల కోట్లు అని అంచనా వేశారు. ఇక, మూలధన వ్యయం రూ.12.20 లక్షల కోట్లు అని పేర్కొన్నారు (Budget capital expenditure).


2026-27 బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయించారంటే (sector-wise allocation)..

  • రవాణా రంగం - రూ.5,98,520 కోట్లు

  • రక్షణ రంగం - రూ.5,94,585 కోట్లు

  • గ్రామీణాభివృద్ధి - రూ.2,73,108 కోట్లు

  • హోంశాఖ - రూ.2,55,234 కోట్లు

  • వ్యవసాయం - రూ.1,62,671 కోట్లు

  • విద్యా రంగం - రూ.1,39,289 కోట్లు

  • ఇంధన రంగం - రూ.1,09,029 కోట్లు

  • ఆరోగ్య రంగం - రూ.1,04,599 కోట్లు


  • పట్టణాభివృద్ధి - రూ.85,522 కోట్లు

  • కామర్స్ అండ్ ఇండస్ట్రీ - రూ.70,296 కోట్లు

  • సోషల్ వెల్ఫేర్ - రూ.62,362 కోట్లు

  • సైంటిఫిక్ డెవలప్‌మెంట్ - రూ.55,756 కోట్లు

  • ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ - రూ.45,500 కోట్లు

  • విదేశీ వ్యవహారాలు - రూ.22,119 కోట్లు

  • ఫైనాన్స్ - రూ.20,649

  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి - రూ.6,812 కోట్లు

Updated Date - Feb 01 , 2026 | 02:51 PM