Home » BRS
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
ఈనెల 19న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్ సిద్ధం చేసింది. మరోవైపు ఎల్లుండి నుంచి ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం ఉధృతం చేయనుంది.
కాంగ్రెస్‌పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్కే భవన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్.
తనకు కష్టకాంలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనని రెండుసార్లు ఓడించారని గుర్తు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం వార్ రూం ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్. వార్ నుంచే ఉప ఎన్నిక కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ తరఫున శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని మాజీ మంత్రి అన్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక.. కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో తమని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.