మంత్రుల మధ్య వాటాల పంచాయితీ
ABN, Publish Date - Jan 19 , 2026 | 12:36 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి టెండర్లలో సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని.. అందుకే ఐఏఎస్, జర్నలిస్టులను బలి పశువులను చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, జనవరి 19: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో హరీష్ మాట్లాడుతూ.. సింగరేణి టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఐఏఎస్, జర్నలిస్టులను బలి పశువులను చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. మేడారం టెండర్లలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ మధ్య పంచాయితీ జరగలేదా అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
అలాగే.. పొంగులేటి కంపెనీ టెండర్లు దక్కించుకున్నది నిజం కాదా అని నిలదీశారు హరీష్ రావు. మద్యం హోలోగ్రామ్ టెండర్లలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ మధ్య వివాదం కాలేదా అని అడిగారు. అంతేకాకుండా ప్రివ్యూ షోలకు రేట్ల పెంపులో మంత్రి కోమటిరెడ్డి, సీఎం రేవంత్ మధ్య పంచాయితీ లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్ నేతలు, జర్నలిస్టులపై సిట్‌లు వేస్తారని.. మరి సీఎం, మంత్రుల మధ్య జరుగుతున్న అంశాల్లో సిట్ ఎందుకు వేయరని నిలదీశారు. సీఎంకు తెలియకుండా సిట్ వేశారంటే.. రేవంత్ ఫెయిల్ అయినట్టే అంటూ హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 19 , 2026 | 01:07 PM