Home » BRS
మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై నిన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కేటీఆర్ స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
నాడు ధరణి, నేడు భూభారతి రెండు వ్యవస్థలు ఒక్కటేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్‌పై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నిర్వహించింది మాక్ అసెంబ్లీ కాదని.. డెమోక్రసీని గులాబీ పార్టీ ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై కాంగ్రెస్ నాయకుడు సామా రామ్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మాక్ అసెంబ్లీపై మార్క్ సెటైర్లు వేశారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో పేదలకు అందాల్సిన ఆస్తులపై కన్నేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఆ భూములను కొల్లగొట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేశారని విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ నెల 7న జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్.. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ)కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేసింది. మహిళా ప్రజాప్రతినిధులపై పురుష పోలీసులతో దాడి చేయించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించారని తెలిపింది
కాంగ్రెస్ హయాంలోని ఇందిరమ్మ రాజ్యం.. భూ రాక్షసులకు స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో భూములను స్వాహా చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.
శాసన సభ సజావుగా జరగకుండా బీఆర్ఎస్ ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన కుట్ర చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులను దూషించడం ద్వారా మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
తెలంగాణ శాసనమండలి నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత 22ఎ పై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.