అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలి.. స్పీకర్‌కు దానం నాగేందర్ విజ్ఞప్తి
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:00 PM
ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 28: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదని అన్నారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, ఆ సమావేశానికి వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్లానని ఆయన పేర్కొన్నారు.
మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని అన్నారు. ఆ పార్టీ అనర్హత పిటిషన్‌లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని చెప్పారు. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను అనుసరించి ఆ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని అన్నారు. అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా భావించవద్దని స్పష్టం చేశారు.
కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా.. స్పీకర్ పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
రోహిత్, కోహ్లీల ఎఫెక్ట్... మారనున్న నిబంధనలు!
కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం.. ఇకపై సులభంగా అన్ని సేవలు..