కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం.. ఇకపై సులభంగా అన్ని సేవలు..
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:18 PM
భారత పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూఐడీఐఏ కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త యాప్ ద్వారా ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ డేటాను షేర్ చేయకుండానే మన ఐడెంటిటీని నిర్ధారించవచ్చు.
ఇంటర్‌నెట్ డెస్క్: మీ ఆధార్ కార్డులో నెంబర్ లేదా ఇతర వివరాలు మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఆధార్ సెంటర్‌కు వెళ్లే సమయం లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ శుభవార్త మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. యూఐడీఐఏ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ సేవలు మరింత సులభతరంగా పౌరులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంట్లో కూర్చుని.. అది కూడా మొబైల్‌లోనే ఆధార్‌కు సంబంధించిన అన్ని విషయాలను మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది.
పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూఐడీఐఏ ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త యాప్ ద్వారా ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ డేటాను షేర్ చేయకుండానే మన ఐడెంటిటీని నిర్ధారించవచ్చు. యాప్ ద్వారా మొబైల్ నెంబర్, అడ్రస్ వివరాలను మార్చుకునే అవకాశం ఉంది. ఫిజికల్ కాపీని ఇతరులకు ఇవ్వకుండానే అవసరమైన ఆధార్ సమాచారాన్ని షేర్ చేయవచ్చు. ఈ యాప్‌లో కుటుంబంలోని ఐదుగురి ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని మేనేజ్ చేయవచ్చు.
యాప్ డౌన్‌లోడ్, వెరిఫికేషన్ ఇలా చేసుకోండి..
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ నెట్ లేకుండానే.. అనవసరమైన వ్యక్తిగత వివరాలను పంచుకోకుండానే ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయవచ్చు.
రెండు రకాలుగా ఆఫ్‌లైన్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
షేర్ ఐడీ పద్దతిలో.. పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఆధార్ ఫైల్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.
స్కాన్ క్యూఆర్ కోడ్ పద్దతిలో .. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయటం ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ అవసరాలకు తగ్గట్టు యాప్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు