Home » BRS
ఆర్టీసీ చార్జీలను పెంచడంపై బీఆర్ఎస్ ఇచ్చిన 'చలో బస్ భవన్’ పిలుపు మేరకు నిరసనకు బయల్దేరిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేకానంద గౌడ్, శంభీర్ పూర్ రాజు, సాయుబాబా తదితరులను కూడా గృహనిర్బంధం చేశారు పోలీసులు.
ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది.
ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌కి పిలుపునిచ్చినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఛలో బస్ భవన్ ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సహా.. బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉన్న బాకీ కార్డుతో గుర్తు చేస్తే... ధోకా కార్డును తెరపైకి తెస్తున్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అమలు కానీ హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్‌రాజులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు బాకీ కార్డు బ్రోచర్స్‌ను విడుదల చేశారు.
బీఆర్ఎస్ గతంలో హామీలు ఇచ్చి అమలు చేయని పనులతో ఢోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సింఘ్వీ , దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి నిన్న(ఆదివారం) రాత్రే ఢిల్లీ చేరుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు ప్రకటించింది.
పెద్దమ్మగడ్డ గ్రామానికి చెందిన విద్యార్థి గణేష్ సరస్వతీ పుత్రుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయిన గణేష్ అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. చిన్నప్పటి నుంచి గణేష్ చదువులో మంచిగా రాణించేవాడు.