MLA Sabitha Reddy: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం
ABN , Publish Date - Jan 13 , 2026 | 08:27 AM
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.
- ఎమ్మెల్యే సబితారెడ్డి ధీమా
సరూర్‌నగర్(హైదరాబాద్): త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని, గ్రేటర్ పీఠం బీఆర్‌ఎస్(BRS)దేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధీమా వ్యక్తం చేశారు. బడంగ్‌పేట్ సర్కిల్‌లోని ప్రశాంతిహిల్స్, మీర్‌పేట్ డివిజన్లకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటర్లు తగిన బుద్ధి చెప్పనున్నారని, ప్రభుత్వ వ్యతిరేకతను బీఆర్ఎస్కు అనుకూలంగా మలచుకోవడానికి నాయకులు కృషి చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
Read Latest Telangana News and National News