Share News

BRS Former MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రూ.5కోట్ల ఆస్తులు సీజ్

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:03 PM

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఐటీ శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమార్తె పేరు మీద ఉన్న కోట్లాది రూపాయిల ఆస్తులను అటాచ్ చేశారు.

BRS Former MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రూ.5కోట్ల ఆస్తులు సీజ్
BRS EX MLA Muthireddy Yadagiri Reddy

వరంగల్, జనవరి 12: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన రూ.5కోట్ల విలువైన ఆస్తులను ఐటీ (ఆదాయపు పన్ను) అధికారులు అటాచ్ చేశారు. బినామీ యాక్ట్ కింద సిద్ధిపేట, జనగామలో ఆయనకు చెందిన పలు విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఐటీ అధికారులు సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో తన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పేరు మీద జనగామ, సిద్దిపేటలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు భూములు కొనుగోలు చేశారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి.. ఆ దిశగా విచారణ చేపట్టారు. తన కుమార్తెను బినామీగా పెట్టి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులకు పలు ఆధారాలు లభ్యమయ్యాయి.


ఆ క్రమంలో ఈ భూముల కొనుగోలుపై యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డిని విచారించారు. ఈ భూములు కొనుగోలు చేసేందుకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందంటూ తుల్జా భవానీ రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని ఐటీ అధికారులకు ఆమె వెల్లడించింది. తన తండ్రి సంతకం పెట్టమని చెబితేనే.. తాను ఈ భూములకు చెందిన సీల్ డీడ్‌పై సంతకం చేశానంటూ ఐటీ అధికారులకు తుల్జా భవానీ దేవి వివరించారు. ఆమె చెప్పిన స్టేట్‌మెంట్‌ను ఐటీ శాఖ ఉన్నతాధికారులు రికార్డు చేశారు. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా సిద్దిపేట, జనగామలో రూ.5కోట్లు విలువైన ఆస్తులను ఐటీ శాఖ అధికారులు ఫ్రీజ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంతకీ సంక్రాంతి జనవరి 14 లేదా 15నా.. ఎప్పుడు జరుపుకోవాలి?

దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 06:49 PM