Talasani Srinivas Yadav: అధైర్య పడొద్దు.. అండగా ఉంటా...
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:17 AM
స్థానికులెవరూ అధైర్య పడొద్దు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌లోని దాసారం బస్తీలో గుడిసెవాసులను ఖాళీ చేయాలని కొంతమంది భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు తలసానికి విన్నవించారు.
- తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: ఎవరూ అధైర్య పడొద్దు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) దాసారం గుడిసె వాసులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సనత్‌నగర్‌లోని దాసారం బస్తీలో గుడిసెవాసులను ఖాళీ చేయాలని కొంతమంది భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు తలసానికి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే బుధవారం అధికారులతో కలిసి దాసారం గుడిసెల్లో పర్యటించి స్థానిక గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ..
గుడిసెలు వేసిన స్థలం తమదని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు వారు, తమదే ఈ స్థలం అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు గుడిసెవాసులను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2014లో తాను ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గుడిసెవాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చానని గుర్తు చేశారు.

సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించిన తీరును గుర్తు చేశారు. కార్యక్రమంలో అమీర్‌పేట సర్కిల్ డీసీ సుజాత, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్, ఆర్‌ఐ సుధీర్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, కొలన్ బాల్‌రెడ్డి, నాయకులు సురే్‌షగౌడ్, కరుణాకర్‌రెడ్డి, సంతోష్ కుమార్, ఖలీల్, పుట్టల శేఖర్, రాజేష్ ముదిరాజ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News