MLC Shravan: కేసీఆర్ ప్రభుత్వం వస్తుందన్నందుకే కక్షగట్టారు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:03 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు వెళుతూ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని శాసనమండలి సభ్యుడు దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్నివర్గాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
- అందుకే రాజాసాబ్ సినిమాకు అనుమతి ఇవ్వలేదు
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్: మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని సినీహీరో ప్రభాస్(Prabhas) పెద్దమ్మ అభిప్రాయం వ్యక్తంచేస్తే.. ఆ విషయం గుర్తుంచుకొని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ కక్షగట్టి.. రాజాసాబ్ సినిమా రేట్లపెంపునకు అనుమతి ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్(MLC Dasoju Shravan Kumar) ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కక్షపూరిత చర్యల్లో భాగంగానే రాజాసాబ్ సినిమాకు జీవో ఇచ్చినట్లే ఇచ్చి హైకోర్టు స్టే(High Court stay) వచ్చేటట్లు చేశారన్నారు.

ఒక్కో హీరోకు ఒక్కో న్యాయమా.? ఒక సినిమాను తిరస్కరించి.. మరో సినిమాకు అనుమతించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రమేయం లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీశ్ మాట్లాడింది నిజంకాదా..? ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు మాటల దాడులు చేయడం దుర్మార్గమన్నారు. సీఎం సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరుచూసి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) తన పదవికి రాజీనామా చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
Read Latest Telangana News and National News