Hyderabad: ‘చేయి’ విడిచి కారెక్కుదామా...
ABN , Publish Date - Jan 17 , 2026 | 10:46 AM
కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాం రా బాబూ.. అని అనుకుంటున్నారంట పలువురు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పలువురు నేతలు. కాంగ్రెస్ అధఇకారంలోకి వచ్చిన కొత్తలో పలువురు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే.. ఇప్పుడు వారి పరిస్థితి అర్ధంగాని స్థితిలో పడిపోయిందని తెలుసస్తోంది.
- బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన నేతల చర్చలు
- తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అంతర్మఽథనం
- సొంత గూటి వైపు చూపు
హైదరాబాద్: రాష్ట్రంలో ఊహించని ఫలితాలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏళ్ల తరబడి కారు పార్టీలో ఉన్న కొందరు నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా హస్తం గూటికి చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram constituency)లోని బీఆర్‌ఎస్ నాయకు లు ఉత్సాహంగా కాంగ్రెస్‌లో చేరారు. మొదట్లో బాగానే ఉన్నా రానురాను వారి పరిస్థితి కాలు కాలిన పిల్లిలా అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలు మారిన నాయకుల పరిస్థితి ఎందుకు చేరాం రా బాబూ అన్నట్లు మారిందని జల్‌పల్లి సర్కిల్‌లో చర్చలు జరుగుతున్నాయి.
అధికార పార్టీలోకి చేరితే ఎంతో కొంత ప్రాధాన్యం వస్తుందని భావించిన బీఆర్‌ఎస్ నాయకులకు ఝలక్ తగులుతోంది. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వడం లేదని, సరైన గౌరవం దక్కడం లేదన్న అసంతృష్తిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరు నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కార్యక్రమలో పాల్గొని ఎమ్మెల్యే చొరవతోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని సభలో చెప్పుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలుపుతున్నారని మహేశ్వరం కాం గ్రెస్ ఇన్‌చార్జికు వీడియో రికార్డింగ్ పంపిస్తుండడంతో, కొందరు అయోమయానికి గురవుతున్నారు.
మాజీ ఎంపీ వర్గీయులనే ఉద్దేశంతో..
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన కొందరికి ఎంపీ వర్గంమని పేరు ఉండటంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు వీరిని దూరంగా పెడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వారిని పట్టించుకోవడం లేదని, మాజీ ఎంపీ సైతం వీరిని పట్టించుకోకపోవడంతో తమ పరిస్థితి గోడమీది పిలిల్లా మారిందని, ఈ క్రమంలో దృఢమైన నిర్ణయం తీసుకోవాలని నాయకులు తమ అనుచరులతో చర్చించుకుంటున్నట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ వైపు
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీగా నాయకులు కార్యకర్త లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. జల్‌పల్లి సర్కిల్ పరిధిలోని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మళ్లీ తమ సొంత గూటికి చేరితే గౌరవం ఉంటుందని భావించి పావులు కదుపుతున్నారు. కారు వీడి కాంగ్రెక్‌లో చేరిన వారిని మళ్లీ స్థానిక ఎమ్మెల్యే కారెక్కనిస్తారా లేదా అనేది చర్చాంశనీయంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News