Home » BJP
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరక్క మజ్లిస్ క్యాండిడేట్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టిందని, మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాధవ్ తెలిపారు.
బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం అయినట్లు తన మొదటి భార్య కుమారుడు దత్తు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేలా ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే తేనికి వెళ్లి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల పర్యవేక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు.
పదేళ్లుగా దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం కేటీఆర్, కవిత గొడవ పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణలో కేసీఆర్ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు? అని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని.. అన్నీ తెలిసినా బీసీలను మోసం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు.
సత్తుపల్లిలో బీసీ బంద్‌లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
న్యాయం కోసం పోరాడిన తమకు న్యాయం లభించలేదని శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ మావోయిస్టులను చంపుతోందని ఆరోపించింది.