Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో దురాగతాలపై గళమెత్తాలి: మాధవ్
ABN , Publish Date - Dec 27 , 2025 | 06:58 PM
బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు.
అమరావతి, డిసెంబర్ 27: బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన మాధవ్.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దురాగతాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించి.. పొరుగు దేశంలో హిందువుల రక్షణ కోసం గళం విప్పాలని కోరారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను, హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారని మాధవ్ పేర్కొన్నారు. హీరోయిన్లు జాన్వీపూర్, కాజల్ అగర్వాల్, సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద చేసిన పోస్టులు కొంత ఊరట నిస్తున్నాయన్నారు. భారత విదేశాంగశాఖ బంగ్లాదేశ్‌పై ఘాటు గానే స్పందించిందన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు మాధవ్.
Also Read:
2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ భావోద్వేగ రోలర్‌కోస్టర్!
దేశంలో నకిలీ గాంధీల మాటలు ఎవరు నమ్మరు: రఘునందన్ రావు
అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..