Bengaluru News: డీఎన్‌ఏ పరీక్షల్లో తేలినా.. పెళ్లికి ససేమిరా
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:26 AM
భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కుమారుడొకరు ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని తీరా గర్భం దాల్చాక మోహం చాటేసిన విషయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- కోర్టును ఆశ్రయించిన బాధితురాలు
- బీజేపీ నాయకుడి కుమారుడి ఉదంతం
బెంగళూరు: ఉడుపి జిల్లా బీజేపీ(BJP) నేత జగన్నివాస్‌రావ్ కుమారుడు కృష్ణ జే రావ్ తండ్రిగా డీఎన్‌ఏ టెస్టులో ఖరారైనా పెళ్లికి మాత్రం ససేమిరా అంటున్నారు. కృష్ణ ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత వారు శారీరకంగా కలిశారు. దీంతో యువతి గర్భవతి అయ్యింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని యువతి పట్టుబడుతున్నా కృష్ణ అంగీకరించలేదు. యువతికి ఆరు నెలలక్రితం బిడ్డ పుట్టారు. అయితే తనకేం సంబంధం లేదంటూ కృష్ణ వాదించాడు. దీంతో బాధిత యువతి కోర్టును ఆశ్రయించారు.
ఇటీవలే న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా కృష్ణతోపాటు పుట్టినబిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు జరిపారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలి వారసత్వం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయినా పెళ్లికి నిరాకరించారు. ఈమేరకు బీజేపీకి చెడ్డపేరు వస్తుందని తండ్రి జగన్నివా్‌సరావ్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. కృష్ణ పెళ్లికి అంగీకరించకపోవడంతో మరోసారి యువతి కోర్టును ఆశ్రయించారు.

తన బిడ్డకు తండ్రి, తనకు భర్త కావాలని కోర్టు తీర్పుకోసం ఎదురుచూస్తున్నట్టు మంగళవారం దక్షిణకన్నడ జిల్లా పుత్తూరులో తెలిపారు. ఆర్‌ఎ్‌సఎస్ ముఖ్యులు కళ్ళడ్క ప్రభాకర్ భట్, మాజీ ఎంపీ నళిన్‌కుమార్ కటీల్, విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నంజుండిలు రాజీ చేసే ప్రయత్నం చేశారు. అయితే కృష్ణ కుటుంబీకులు విచిత్రమైన కోరికలు కోరుతున్నారని కేపీ నంజుండి తెలిపారు. ప్రేమించి శారీరకంగా ఒక్కటై బిడ్డ పుట్టినతర్వాత ఓ యువతిని రోడ్డున పడేసేలాంటి చర్యలు సమంజసం కాదని నంజుండి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News