Shyam Biharil Lal: బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:21 PM
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
బరేలీ: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్యామ్ బిహారీ లాల్ (Dr Shyam Bihari Lal) శుక్రవారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఫిలిబిత్ రోడ్డులోని మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనవరి 1వ తేదీన ఆయన 60వ పుట్టినరోజు జరుపుకొన్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
యోగి ఆదిత్యనాథ్ సంతాపం
ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీరామని ప్రార్థిస్తున్నానని ఒక సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ఎవరీ శ్యామ్ బిహారీ లాల్?
డాక్టర్ శ్యామ్ బిహారీ లాల్ గతంలో రోహిల్‌ఖండ్ యూనివర్శిటీ హిస్టరీ డిపార్ట్‌మెంట్ అధిపతిగా పనిచేశారు. 2012లో ఫరీద్‌పూర్ (రిజర్వ్‌డ్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్టుపై పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2017లో తిరిగి పోటీ చేసి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సియారామ్ సాగర్‌పై గెలిచారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఫరీద్‌పూర్ నుంచి గెలిచారు. పార్టీలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
షారూక్ ఖాన్ నాలుక కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత
మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి