K. Lakshman: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలు..
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:34 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని, త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సహితం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
- రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తోడుదొంగలేనని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్(K. Lakshman) అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ముషీరాబాద్ వాలీబాల్ గ్రౌండ్‌లో స్థానిక కార్పొరేటర్ సుప్రియానవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రెండేళ్లలో నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.
బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగినా ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని అన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సహితం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్‌గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ రమే్‌షరామ్, కో-కన్వీనర్ నవీన్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, నాయకులు సదానంద్ ముదిరాజ్, జమల్‌పూరి నందు, కుశాల్‌గౌడ్, కృష్ణమాదిగ, వాసు, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
వాజ్‌పేయిది విలువలతో కూడిన రాజకీయం
రాంనగర్ : విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతున్నా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని నేను నడపలేను ప్రజాభివృద్ధి చేయలేనని తేల్చి చెప్పి పార్లమెంట్ నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లిన గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అని కొనియాడారు. సోమవారం సత్యానగర్ కమ్యూనిటీహాల్‌లో బీజేపీ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు పాశం సాయికృష్ణయాదవ్ ఆధ్వర్యంలో వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో డా.కె.లక్ష్మణ్, పార్టీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్‌గౌడ్‌లు పాల్గొని చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బాగ్‌లింగంపల్లిలో దుప్పట్ల పంపిణీ
బీజేపీ నాయకుడు చాతిరి పార్థసారథి ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో పేదలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ నాయకులు రాహుల్, జైపాల్‌రెడ్డి, గడ్డం సతీష్, అరుణ్, రమే్‌షరామ్, జ్యోతి పాల్గొన్నారు.

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
కవాడిగూడ: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కవాడిగూడ బండమైసమ్మనగర్ కమ్యూనిటీహాలులో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుష్పగిరి ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం, కంటిశుక్ల ఆపరేషన్లు చేసే వైద్య శిబిరాన్ని ఎంపీ లక్ష్మణ్, కార్పొరేటర్ జి రచనశ్రీ సోమవారం ప్రారంభించారు.
ఈసందర్భంగా 102 మంది కంటి వైద్య పరీక్షలు చేసుకోగా వారిలో పది మంది క్యాట్రాక్ ఆపరేషన్ల కోసం పుష్పగిరి కంటి ఆస్పత్రికి తరిలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గంట శ్రీనివా్‌సను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ తనయుడు రాహుల్, మాజీ కార్పొరేటర్ టి రవీందర్, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి భరత్‌గౌడ్, ఎం రమే్‌షరాం, కార్యదర్శి సలంద్రి శ్రీనివా్‌సయాదవ్, రాష్ట్ర నాయకులు జి వెంకటేష్, సి మల్లారెడ్డి, డివిజన్ అధ్య క్ష, కార్యదర్శులు సలంద్రి దిలీప్ యాదవ్, కేశవరాజు, రమేష్ పాల్గొన్నారు.
కోదండరెడ్డినగర్‌లో దుస్తుల పంపిణీ
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కవాడిగూడ డివిజన్ కోదండరెడ్డినగర్‌లో బీజేపీ రాష్ట్ర నాయకుడు జి వెంకటేష్, కార్పొరేటర్ జి రచనశ్రీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. బస్తీలోని చిన్నారుల తల్లిదండ్రులకు డాక్టర్ కె లక్ష్మణ్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప యాదవ్, కేశవరాజు. రమేష్, మహేందర్‌బాబు, ప్రభాకర్ గంగపుత్ర, రమేష్ గౌడ్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News