Home » BJP
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, బిహార్‌లో ఎన్డీయే కూటమికి జేడీయూ నాయకత్వం వహిస్తుంది. 101 నుంచి 102 సీట్లలో ఆ పార్టీ పోటీ చేయనుంది. జేడీయూ కంటే ఒక సీటు తక్కువతో బీజేపీ పోటీ చేయనుంది.
సీట్ల షేరింగ్ వ్యవహారంలో అసంతృప్తులు ఉన్నట్టు వస్తున్న ఊహాగానాలకు బీజేపీ అధిష్ఠానం కొట్టి వేస్తున్నప్పటికీ, సాధ్యమైనన్ని సీట్లు దక్కించుకునేందుకు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేజీ (రామ్ విలాస్), హెచ్ఏఎం పార్టీ చీఫ్ జితిన్ రామ్ మాంఝీ కొన్ని కాలంగా పట్టుబడుతున్నాయి.
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఆయన అభివర్ణించారు.
టీవీకే అధినేత విజయ్‌కు ప్రాణహాని ఉందని, ఆ అనుమానంతోనే ఆయన కరూర్ వెళ్లేందుకు భద్రత కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో గురువారం నయినార్ నాగేంద్రన్ విలేఖరులతో మాట్లాడుతూ... కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనలో విజయ్ ఇంకా బాధితులను పరామర్శించలేదన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని.. బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఆయన కోరారు.
సీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై అర్వింద్ స్పందించారు. బీసీలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవంతో రేవంత్ ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్లాన్ ‘బీ’ని సిద్ధం చేసుకుని ఇవాళ హైకోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు.
మదురై నుంచి ఈనెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్ ‘తమిళగం నిమిర తమిళనిన్ పయనం’ పేరుతో చేపట్టనున్న ప్రచారానికి నగర పోలీసు శాఖ అనుమతులు జారీచేసింది.
బీజేపీ ఎలక్షన్ కమిటీ బుధవారంనాడు పాట్నాలో కీలక సమావేశం జరిపింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కో-ఇన్‌చార్జి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జేపీకి 25 సీట్లు, హెచ్ఏఎం నేత జితిన్ రామ్ మాంఝీకి 7 సీట్లు, ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎంకు 6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. తమ పార్టీ నేతలకు నిర్దిష్ట నియోజకవర్గాలు కేటాయించాలని చిరాగ్ పాశ్వాన్ కోరుతుండటంతో చర్చలు కొనసాగుతున్నాయి.