Share News

BJP State President: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఎంజీఆర్‌తో ఎవరినీ పోల్చలేం..

ABN , Publish Date - Dec 19 , 2025 | 01:01 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో ఎవరినీ పోల్చలేమంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది.

BJP State President: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఎంజీఆర్‌తో ఎవరినీ పోల్చలేం..

- బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌

చెన్నై: ప్రజలు మెచ్చిన నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో ఎవరినీ పోల్చలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌(BJP State President Nainar Nagendran) తెలిపారు. బీజేపీ చేపట్టిన ప్రచార యాత్ర జిల్లాలోని కేపీ కుప్పంలో సాగింది. కేవీ కుప్పం బస్టాండ్‌ సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... విజయ్‌ బీజేపీ-బి టీం అని డీఎంకే నేతలు ప్రచారం చేస్తున్నారని,


nani4.2.jpg

ఒక అబద్ధం పదేపదే చెబితే అది నిజమవుతుందని వారి అభిప్రాయమన్నారు. బీజేపీ నుంచి అన్నాడీఎంకేను రక్షించాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని రక్షిస్తారు? ఎవరిని శిక్షిస్తారు? అనే విషయం తెలుస్తుందని నయినార్‌ నాగేంద్రన్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి, వెండి ధరలు మరింత పైకి!

కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2025 | 01:01 PM