Home » Bhogapuram Airport
భోగాపురం విమానాశ్రయంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు భోగాపురం ఎయర్‌పోర్టే కొత్త గేట్‌వే అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు విమానాశ్రయం టెర్మినల్ వద్ద దిగిన ఫొటోను ట్యాగ్ చేశారు.
వైసీపీ అధ్యక్షుడు ఏదో ఒకటి అనేసి ‘డ్యామేజీ’ చేసేస్తారు! ఆ తర్వాత... అదే పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి ‘డ్యామేజీ కంట్రోల్’కు ప్రయత్నిస్తారు. అనేక విషయాల్లో జరిగింది ఇదే! ఇప్పుడు... ‘ఎర్రబస్సు’తో వైసీపీకి పెద్ద తిప్పలొచ్చి పడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఘనంగా నిర్వహించింది.
ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమాంధ్రగా నిలువబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ-దిశ మారబోతున్నాయన్నారు.
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజే రన్‌వే... పలు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లతో సందడిగా కనిపించింది.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఎగిరే చేప ఆకృతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను అడుగడుగున ప్రతిబింబిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం... రూ.5,000 కోట్ల వ్యయం... అతి తక్కువ సమయంలో నిర్మాణం... ఆధునిక హంగులు, అందమైన సొబగులు... అదే భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. విమానాశ్రయం టెర్మినల్ వద్ద నిలబడి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైపు చూపిస్తున్న స్టిల్ ఫొటోను షేర్ చేస్తూ ‘The future? Yeah... it's that way!’ అని క్యాప్షన్ ఇచ్చారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ గిరిజన విద్యార్థినిలు, మహిళలు చేసిన థింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భారత్‌ను ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తోన్న నేత ప్రధాని మోదీ అని కొనియాడారు.