ప్రారంభోత్సవం నాడే ప్రైవేటు విమానాలు
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:33 AM
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజే రన్‌వే... పలు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లతో సందడిగా కనిపించింది.
భోగాపురం, (ఆంధ్రజ్యోతి): భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజే రన్‌వే... పలు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లతో సందడిగా కనిపించింది. ప్రధాని నేవీకి చెందిన ప్రత్యేక విమానంలో భోగాపురం వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేర్వేరుగా హెలికాప్టర్లలో వచ్చారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చార్టర్డ్ ఫ్లైట్‌లో ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జీఎంఆర్ గ్రూపు ఆహ్వానించిన వ్యాపార ప్రముఖులు హెలికాప్టర్లు, ప్రైవేటు విమానాల్లో వచ్చారు. శనివారం ఒక్కరోజే సుమారు పది వరకు విమానాలు, హెలికాప్టర్లు వచ్చాయని సమాచారం. ఈ నెల 17 నుంచి వాణిజ్య కార్యకలాపాలు(విమానాల రాకపోకలు) ప్రారంభం కానున్నాయి.