Home » BCCI
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది.
వచ్చే నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అయితే జులై 28న దీనికి సంబంధించిన భారత జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దేందుకు భారత యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జింబాబ్వేతో రెండో టీ20కి ముందు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి వైభవ్ భవిష్యత్తు గురించి మాట్లాడాడు.
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ విషయంలో జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన అస్త్రంగా నిలిచిన షమీని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని మండిపడ్డాడు.
జింబాబ్వేతో తొలి టీ20లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు గురువారం నుంచి జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముందు భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. జట్టుకు ధైర్యం చెప్పాడు. బయట విమర్శలను పట్టించుకోకుండా.. వైఫల్యాలకు భయపడకుండా ఆడితేనే ఉత్తమ ప్రదర్శన చేయాలని సూచించాడు.
భారత జట్టును కొంతకాలంగా గాయాల బెడద వెంటాడుతోంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), జట్టు యాజమాన్యం, సపోర్ట్ స్టాఫ్ మధ్య సరైన సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.
భారత టీ20 జట్టులో చోటు దక్కడంతో తన జీవితకాల కల నెరవేరిందని యువ పేసర్ అశోక్ శర్మ వెల్లడించాడు. జులై 23 నుంచి 26 వరకు టీమిండియా.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.
దేశవాళీ క్రికెట్‌లో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు ఆట నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెచ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.